బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ, ఈసారి తన బ్రాండ్ ఇమేజ్ అయిన ‘రౌడీ’ని బాగా వాడేస్తున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన'(Rowdy Janardhana) గ్లింప్స్ చూస్తుంటే.. విజయ్ ఈసారి రక్తపాతానికి సిద్ధమయ్యాడని అర్థమవుతోంది.సాధారణంగా ఫ్యామిలీ కథలను ఇష్టపడే దిల్ రాజు, ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత పూర్తిగా రూట్ మార్చారు.
ఈసారి ఫుల్ ‘గోర్ (Gore) యాక్షన్’ ఎంటర్టైనర్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. వచ్చే ఏడాది (2026) డిసెంబర్‌లో రిలీజ్ కాబోయే ఈ సినిమాకి, ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేయడం విశేషం. క్రిస్టో జేవియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వయోలెన్స్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.అయితే, ఈ గ్లింప్స్‌లో విజయ్ వాడిన ‘LK'(ల*జ కొ*కు) అనే బూతు పదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

సరిగ్గా మొన్ననే నాని అనౌన్స్ చేసిన ‘ది పారడైజ్’ పోస్టర్‌లో కూడా ఇదే పదాన్ని టాటూగా చూపించారు. నాని సినిమా కూడా అవుట్ కాస్ట్స్ కథేనని డైరెక్టర్ చెప్పారు. ఇప్పుడు విజయ్ సినిమా కూడా అదే డార్క్ టోన్, అగ్రెసివ్ డైలాగ్స్‌తో ఉండటంతో.. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య కంపారిజన్స్ మొదలయ్యాయి.రెండు సినిమాల కాన్సెప్ట్‌లు, వైబ్స్ ఒకేలా ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా, ఈ ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే.. బలమైన కథ, ఒరిజినాలిటీ ఉన్న సినిమానే చివరికి బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.
మరోపక్క నానికి ‘దసరా’ వంటి పెద్ద హిట్ ఇచ్చాడు కాబట్టి శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ‘ది పారడైజ్’ పై గట్టి నమ్మకమే ఉంది. కానీ ‘రౌడీ జనార్దన’ తీస్తున్న దర్శకుడు రవి కిరణ్ కోలా తీసిన ‘రాజావారు రానిగారు’ పెద్ద హిట్టేమీ కాదు. కాబట్టి ఈ ఇద్దరిలో అతనిపైనే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ 2 సినిమాలు 2026 సమ్మర్ కే రిలీజ్ అవుతాయని అంచనా.
