టాలీ వుడ్ హీరోలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఈ పాటకు ఆస్కార్ ఆ రావడమే కాకుండా ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గా నిలిచారు.
ప్రతి ఏడాది చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు. అయితే వచ్చే ఏడాది మార్చిలో ప్రకటించబోయే ఆస్కార్ అవార్డు వేడుకలకు సన్నహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోని ఈ ఏడాది ఆస్కార్ అవార్డు అకాడమీ ఏకంగా 398 మంది జ్యూరీ మెంబర్స్ ను కొత్తగా ఎంపిక చేశారు. ఈ జూరీలో యాడ్ అయినటువంటి వారిలో RRR సినిమాకు చెందినటువంటి హీరోలతో పాటు ఇతరులు కూడా భాగం కావడం విశేషం.
ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి చంద్రబోస్, సెంథిల్ వంటి వారు కూడా భాగమయ్యారు.అయితే ఈ జ్యూరీ మెంబర్స్ లిస్టులో దర్శకుడు రాజమౌళి లేకపోవడం గమనార్హం. ఈ విధంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గా ఎంపిక అవడం పట్ల మెగా నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాని (RRR) అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినటువంటి దర్శకుడు రాజమౌళి పేరు ఇందులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక RRR సినిమాకు ఆస్కార్ రావడానికి ఎంతో కృషి చేసినటువంటి రాజమౌళి తదుపరి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఆస్కార్ రేసులో తప్పకుండా ఉంటుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా మొదలవ్వకుండానే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.