ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి ఆస్కార్ రావాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. హీరోల కేటగిరీలో అయినా, డైరెక్టర్ కేటగిరీలో అయినా ఈ సినిమాకు ఆస్కార్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్, తారక్ లలో ఎవరికి ఆస్కార్ వచ్చినా తమకు సంతోషమేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ లో ఇద్దరు హీరోలు అద్భుతంగా చేశారని ఇద్దరు హీరోలలో ఎవరి యాక్టింగ్ ను తక్కువ చేయలేమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ ఫర్ ఆస్కార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.
వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ అంచనాల జాబితాను రిలీజ్ చేసిన నేపథ్యంలో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయనే సంగతి తెలిసిందే.
విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ప్యానెల్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఎంపిక చేయడానికి ఆసక్తి చూపిస్తుందో లేదో చూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ ను ఆస్కార్ నామినేషన్స్ కు పంపడానికి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఊహించని స్థాయిలో పెంచిందనే సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ కు ఆస్కార్ వస్తే ఈ సినిమాకు పని చేసిన వాళ్ల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.