‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న పెద్ద ఎత్తున ఎన్టీఆర్, చరణ్ అభిమానులు సందడి చేశారు. 35 సెంటర్ల వరకు ‘ఆర్.ఆర్.ఆర్’ 50 రోజులు ప్రదర్శింపబడింది. ‘ఆర్.ఆర్.ఆర్’ పక్కన ‘కె.జి.ఎఫ్2’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు రిలీజ్ అయినా బాగా పెర్ఫార్మ్ చేసింది.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ ను సాధించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించ లేకపోయింది.
ఏదేమైనా 50 రోజులు లాంగ్ రన్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించింది. ఈ వీకెండ్ వరకు కూడా 60 థియేటర్లలో ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రదర్శింపబడనుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ 50 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
112.06 cr
సీడెడ్
50.66 cr
ఉత్తరాంధ్ర
33.13 cr
ఈస్ట్
16.36 cr
వెస్ట్
13.27 cr
గుంటూరు
18.17 cr
కృష్ణా
14.67 cr
నెల్లూరు
09.38 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
267.70 cr
తమిళనాడు
38.31 cr
కేరళ
10.68 cr
కర్ణాటక
44.35 cr
హిందీ
133.52 cr
ఓవర్సీస్
102.42 cr
రెస్ట్
10.01 cr
టోటల్ వరల్డ్ వైడ్
606.99 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 50 రోజులు పూర్తయ్యేసరికి రూ.606.99 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1131(కరెక్టెడ్) కోట్లు కొల్లగొట్టింది.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధించింది. లాభాలు తెచ్చిపెట్టింది.
అయితే ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించలేకపోయింది. ‘బాహుబలి 2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం త్వరలో చైనాలో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్కడ కనుక హిట్ అయితే మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.