‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో యావత్ ప్రపంచం చూపు తెలుగు పరిశ్రమ వైపు తిప్పారు దర్శకధీరుడు రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు.. ‘ట్రిపులార్’ రిలీజ్ అయ్యి 9 నెలలవుతున్నా ఇంకా జనాలు దీని గురించే మాట్లాడుకుంటున్నారు.. జపాన్‌లో రిలీజ్ అప్పటి హంగామా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..
ఇటీవల హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజమౌళి.. ఇప్పటికే పలు ప్రశంసలు, పురస్కారాలు పొందుకున్నారాయన.. ఇప్పుడు ట్రిపులార్ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ప్రెస్ అకాడమీస్ 27వ శాటిలైట్ అవార్డ్స్ (International Press Academy’s 27th Satellite Awards) లో నామినేషన్స్ సాధించింది.. ఈ సినిమా ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయిందనే వివరాలు ఇలా ఉన్నాయి..
1. బెస్ట్ మోషన్ పిక్చర్ (కామెడీ / మ్యూజికల్)..
2. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. (నాటు నాటు)..
3. బెస్ట్ సౌండ్.. (ఎమ్.ఎమ్.కీరవాణి)..
4. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. (శ్రీనివాస మోహన్)..
5. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్.. (సాబు సిరిల్)..
అయితే ‘బెస్ట్ మోషన్ పిక్చర్’ కేటగిరీలో కామెడీ లేదా మ్యూజికల్ రెండిట్లో నామినేట్ అవడంపై కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి.. ‘‘యాక్షన్ ఫిలిం అయిన ట్రిపులార్ వాళ్లకి కామెడీ మూవీలా ఉందా?’’ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం ఆస్కార్ బరిలో దిగనుందంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.. #RRRForOscars హ్యాష్ ట్యాగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటూ.. వైరల్ అవుతోంది..
ఇంతకుముందు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు ‘‘స్పాట్ లైట్ విన్నర్’’ అవార్డు వచ్చింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ డైరెక్టర్).. శాటన్ అవార్డ్స్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం).. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం).. మరియు సన్ నెట్ సర్కిల్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం) అవార్డులు ట్రిపులార్ చిత్రాన్ని వరించాయి..
#RRR got 5 nominations at the International Press Academy’s 27th Satellite Awards!