2018 నవంబర్ 18న ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేసి 2022 నవంబర్ 18 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి. సినిమా విడుదలై 8 నెలలవుతోంది. ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతుంది.. అయినా ఇంకా ఇంచు కూడా క్రేజ్ తగ్గలేదు.. పోయిన నెలలో ట్రిపులార్ జపాన్‌లో భారీగా రిలీజ్ అయ్యి, రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది. జపాన్ జనాలు తమ మీద చూపించిన ఆదరణకి తారక్, చరణ్, జక్కన్న షాక్‌తో కూడాన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు. రాబోయే నవంబర్ 23 వరకు జపాన్‌లో టికెెట్స్ ఫుల్ అయిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్‌గా దర్శకధీరుడు రాజమౌళి.. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఆయన తనయుడు కార్తికేయతో కలిసి సందడి చేశారు. ‘‘స్టూడెంట్ నెం.1’ నుండి ‘ఆర్ఆర్ఆర్’ వరకు.. ఎక్కడ మొదలై.. ఎక్కడి వరకు వచ్చింది జక్కన్న జర్నీ’’ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట రాజమౌళి సూట్‌లో ఉన్న స్టైలిష్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పి ప్రేక్షకాభిమానులకు కిక్ ఇచ్చారు రాజమౌళి.
ఇదిలా ఉంటే.. లాస్ ఏంజెల్స్‌లో ట్రిపులార్ మూవీ స్క్రీనింగ్ చేశారు.. థియేటర్లో అక్కడి ఆడియన్స్ చేసిన హంగామా చూస్తే.. మనం హాలీవుడ్ సినిమా చూస్తున్నామా?.. లేక, హాలీవుడ్ వాళ్లు మన తెలుగు మూవీ చూస్తున్నారా? అనేది కొద్దిసేపటి వరకు అర్థంకాదు. ఆ రేంజ్‌లో రచ్చ రంబోలా చేశారు. స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అప్పుడు ఇక్కడ జరిగే సందడి కంటే మించే జరిగిందక్కడ.‘నాటు నాటు’ పాటకి స్క్రీన్ ఎక్కేసి మరీ చిందులేశారు.
హైలెట్ ఏంటంటే పులి బొమ్మలు తీసుకొచ్చి మరీ గోల గోల చేశారు. క్లాప్స్, విజిల్స్, అరుపులు.. ఇలా థియేటర్లో ఏ ఒక్కరూ ఖాళీగా లేరు.. సోషల్ మీడియాలో వాళ్లు చేసిన జాతర చూసి.. ‘ఇదెక్కడి మాస్ రా మావా’ అనుకుంటున్నారు మన జనాలు.. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్ అవార్డ్స్‌లో RRR బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకుముందు ‘బాహుబలి – ది బిగినింగ్’ కి కూడా ఈ అవార్డ్ వచ్చింది.