RRR Movie: వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ స్పెషల్ పోస్టర్.. ఏమైందంటే?

రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, తారక్ హీరోలుగా తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై 5 నెలలైనా ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక హీరోగా నటించిన తారక్ కు, ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వచ్చే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ జపాన్ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని పోస్టర్లతో పోల్చి చూస్తే బెస్ట్ పోస్టర్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. త్వరలో జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది. తారక్, చరణ్ లకు జపాన్ ప్రేక్షకులలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ జపాన్ వెర్షన్ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జపాన్ ఫేమస్ గేమ్ డిజైనర్లలో ఒకరైన కొజిమ హిడియో ఆర్ఆర్ఆర్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ పోస్టర్ లో అల్లూరి పాత్రలో రామరాజు, భీమ్ పాత్రలో తారక్ కనిపించడంతో పాటు ఆర్ఆర్ఆర్ హైలెట్ సీన్లలో ఒకటైన ఇంటర్వెల్ సీన్ లోని జంతువుల ఫోటోలు ఉండటంతో ఈ పోస్టర్ స్పెషల్ పోస్టర్ గా నిలిచింది. అక్టోబర్ 21వ తేదీన రికార్డ్ స్థాయి థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ జపాన్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ భారీ స్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకున్నా బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోవడంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు. అయితే జపాన్ తో పాటు మరికొన్ని దేశాలలో ఈ సినిమాను విడుదల చేస్తే మాత్రం బాహుబలి2 సినిమా రికార్డులు బ్రేక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus