ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ నెల 13వ తేదీన దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. కథనంలో కీలక మలుపులతో సినిమాను సక్సెస్ చేసే రాజమౌళి ఈ సినిమాలో కథనాన్ని ప్రేక్షకుల ఊహకందని మలుపులతో తయారు చేసినట్టు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో దొంగ పాత్రలో, కొమురం భీమ్ పాత్రలో కనిపిస్తాడని రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఫస్టాప్ అంతా జూనియర్ ఎన్టీఆర్ తెరపై ఎక్కువగా కనిపిస్తారని సెకండాఫ్ లో చరణ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య ఒక యాక్షన్ సన్నివేశం కూడా ఉంటుందని సమాచారం. ఈ యాక్షన్ సీన్ సినిమాలో ట్విస్ట్ గా ఉండబోతుందని సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్ కథ గురించి ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రమే కథలో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను మెప్పించేలా రాజమౌళి కథనాన్ని రాసుకున్నారని.. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్లు, ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ విషయంలో రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.