‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’ … ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉండేవి. కానీ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో కొన్ని చోట్ల థియేటర్లు మూతపడడం, ఆంధ్రాలో టికెట్ రేట్ల ఇష్యు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో మళ్ళీ ఇవి వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి ఎండింగ్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని.. మార్చి నుండీ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి మూసుకున్న థియేటర్లు తెరుచుకుంటాయని కొన్ని సర్వే లు చెబుతుండడంతో…
‘రాధే శ్యామ్’ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. ఆ డేట్ కు సిద్ధంగా ఉండాలని బయ్యర్స్ కు ‘యూవీ క్రియేషన్స్’ వారు పిలుపునిచ్చారు కూడా. అదే డేట్ కు వాళ్ళ ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు కాబట్టి.. ఆ డేట్ ను ‘యూవీ క్రియేషన్స్’ వాళ్ళే లాక్ చేశారు కాబట్టి దాన్ని పక్కకి జరిపి ‘రాధే శ్యామ్’ ను థియేటర్లలో దింపడం ఈజీ..! కాకపోతే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి రెండు రిలీజ్ డేట్లను లాక్ చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది.
అందులో ఒకటి మార్చి 18న అని ఉండగా.. రెండోది ఏప్రిల్ 28న అని ఉంది. దీంతో ఇప్పుడు ‘రాధే శ్యామ్’ రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. మొదటి నుండీ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అనేది పక్క సినిమాల రిలీజ్ డేట్లకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంది. జనవరి 7కి కనుక ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించకపోతే ‘భీమ్లా నాయక్’ లేదా ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ఉండేవి. ‘ఆర్.ఆర్.ఆర్’ కచ్చితంగా వస్తుందని భావించే ‘భీమ్లా’ ‘ఆచార్య’ టీంలు పోస్ట్ ప్రొడక్షన్ పనులని లైట్ తీసుకున్నారు.
ఇప్పుడు ‘రాధే శ్యామ్’ రిలీజ్ కు కూడా అదే విధంగా అడ్డపడుతుంది ‘ఆర్.ఆర్.ఆర్’. మార్చి 18న కనుక ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయ్యి ఏప్రిల్ 28న కనుక ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయితే ఏ సినిమాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఈ రెండు సినిమాలకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఫైనల్ గా ఏమవుతుందో..!
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!