భారీ పాన్ ఇండియన్ మూవీ మరియు మల్టీ స్టారర్ అయిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతున్నట్టు.. ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువైంది. దాంతో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. తెలంగాణలో కూడా మే 12 నుండీ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక కొద్ది రోజుల క్రితమే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఆగిపోయింది.
క్లైమాక్స్ పార్ట్ కూడా ఈ మధ్యనే మొదలైనట్టు చిత్ర యూనిట్ సభ్యులు మొన్నామధ్య ప్రకటించారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు వారు తెలిపారు. అయితే కొంత భాగాన్ని రీ షూట్ చేయాల్సి కూడా ఉంది అని ఇన్సైడ్ టాక్. దానికి రాజమౌళి కనీసం 6 నెలలైనా టైం తీసుకుంటారు. దాంతో మరోసారి ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు..
అలా అని ఖండించడం లేదు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల తేదీ పై మే 20న క్లారిటీ ఇవ్వబోతున్నారట చిత్ర యూనిట్ సభ్యులు. ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను లేదా వీడియో ద్వారా విడుదల తేదీ పై వారు క్లారిటీ ఇవ్వబోతున్నట్లు వినికిడి.దీనిని బట్టి చూస్తుంటే.. 2022 కి ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్ట్-పోన్ అయ్యిందనే కామెంట్లు కూడా మొదలయ్యాయి.