టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి ప్రకటన చేయగా ఆ ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో బాహుబలి3 గురించి కామెంట్స్ చేసిన రాజమౌళి ఇప్పుడు మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి కామెంట్ చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ లో హీరోలు మారవచ్చని ప్రచారం జరుగుతున్నా రాజమౌళి అలాంటి తప్పు చేయరని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ సినిమాను జక్కన్న పూర్తి చేయడానికి మరో మూడేళ్ల సమయం పడుతుంది.
ఈ సినిమా పూర్తైన తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ దిశగా అడుగులు పడతాయని సమాచారం అందుతోంది. జక్కన్న గతంలో కూడా పలు ప్రాజెక్ట్ లను ప్రకటించి మధ్యలోనే వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ లను ఆపేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం సీతారామరాజు, భీమ్ తమ ప్రాంతాల కోసం వేర్వేరుగా పోరాటం చేయడాన్ని ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది.
వేర్వేరుగా పోరాటం చేసిన రామ్, భీమ్ ఒక సమస్యను పరిష్కరించడం కోసం ఇద్దరూ కలవాల్సి వస్తుందని బోగట్టా. స్టోరీ లైన్ సింపుల్ గానే ఉన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండే విధంగా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ అంటే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటంతో పాటు ఆకాశమే హద్దుగా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారా? లేక మరో నిర్మాత ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తారా? చూడాల్సి ఉంది. రాజమౌళి సరైన ప్లానింగ్ తో ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ విషయంలో అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.