ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా సరే త్రిమూర్తులు దర్శనమిస్తున్నారు.. వాళ్ళు ఎవరో కాదు మన ట్రిపులార్ త్రిమూర్తులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి.. జపాన్ దేశంలో RRR మూవీ రిలీజ్ కానుండడంతో కొద్ది రోజుల క్రితం ఈ ముగ్గురూ ఫ్యామిలీస్ తో కలిసి వెళ్ళారు.. అక్కడ ప్రమోషన్స్ నుండి.. ఫ్యాన్స్ మీట్, లోకల్ ప్లేసెస్ విజిట్ చేయడంతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
ఎట్టకేలకు ఈరోజు (అక్టోబర్ 21) జపాన్ స్క్రీన్స్ పైన బొమ్మ పడింది.. దాదాపు 250కి పైగా లొకేషన్లలో మూవీ రిలీజ్ అయింది.. టికెట్ల కోసం మన దగ్గర ఎంత హంగామా ఉంటుందో అలాగే అక్కడి అభిమానులు, ప్రేక్షకులు కూాడా ఆ స్థాయిలో సందడి చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా థియేటర్ దగ్గర బుకింగ్ కౌంటర్స్ ముందు క్యూ కట్టారు అంటే.. ట్రిపులార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది..
టికెట్ల కోసం కంగారు పడాలా? మళ్లీ ఎప్పుడు చూస్తామో తెలియదు కాబట్టి సెలబ్రిటీలను కలవడానికి కంగారు పడాలో అర్థంకాని అయోమయంలో పడిపోయారు అక్కడి వాళ్ళు.. ఇక షో స్టార్ట్ అయ్యాక థియేటర్లలో రచ్చ రంబోలా చేశారట.. దేశం కాని దేశంలో సినిమా పట్ల, తమ పట్ల టోక్యో జనాలు చూపించిన ప్రేమాభిమానాలకు మనోళ్లకి మాటలు రాలేదు.. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన జక్కన్న..
ఇప్పుడు ట్రిపులార్ జపాన్ దేశంలో విడుదలవడంతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. అలాగే ఆయన పాపులర్ వీడియో గేమ్ క్రియేటర్ కోజిమా స్టూడియోకి వెళ్లి అక్కడ త్రీడీలో పిక్చర్స్ తీసుకోవడం.. చరణ్, ఉపాసన దంపతులకు టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ వారు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ ట్రెండ్ అవుతున్నాయి..