రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఇతర భాషల్లోకి ఈ సినిమా డబ్ కావడంతో పాటు అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నాటునాటు ఇంగ్లీష్ వెర్షన్ వైరల్ అవుతోంది.
ఫారినర్స్ ఈ నాటు నాటు సాంగ్ లిరిక్స్ ను ఇంగ్లీష్ లోకి మార్చుకుని వీడియో సాంగ్ చేయగా ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫన్నీగా ఉన్న ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ విడుదలై ఆరు నెలలు దాటినా ఈ సినిమాకు అణువంతైనా క్రేజ్ తగ్గలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాటునాటు ఇంగ్లీష్ వెర్షన్ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. జపాన్ లో కూడా ఈ సినిమా విడుదలవుతుండగా అక్కడ కూడా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరోవైపు జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
రాజమౌళి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి మొదలుకానుంది. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన నటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. 700 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.