‘ఆర్.ఆర్.ఆర్’ అభిమానులకు గుడ్ న్యూస్..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ఆస్కార్ విషయంలో అన్యాయం జరిగినట్లు పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా తరఫున ఈ చిత్రానికి బదులు ఓ గుజరాతి సినిమాని ఎంపిక చేయడంపై అందరూ అభ్యంతరాలు తెలిపారు. అయితేనే ‘ఆర్.ఆర్.ఆర్’ కామన్ ఎంట్రీ రూపంలో ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక్కడ అవార్డులు గెలుచుకుంటుందో లేదో.. అసలు గెలుచుకుంటే ఏ విభాగంలో గెలుచుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆ అన్ని చోట్ల ఓ ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ పాటకు మాత్రం ఆస్కార్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ఇన్సైడ్ టాక్.

‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఈ పాటకు ఆస్కార్ వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్కార్ కమిటీ వారు కూడా ఈ పాటకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న టాక్. ఇదిలా ఉండగా.. ఒక్కో విభాగానికి 15 చొప్పున 10 కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ అయిన సినిమాల వివరాలను ఇటీవల ఆస్కార్ బోర్డు అనౌన్స్ చేసింది. ఈ లిస్ట్ లో ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ కు కూడా స్థానం దక్కింది. ఇది అందరూ సంతోషించదగ్గ విషయమే!

అయితే విషాదకరమైన విషయం ఏంటి అంటే ఒరిజినల్ స్కోర్, మేకప్, వీఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే ఇంకా కొన్ని కేటగిరీల నామినేషన్ల వివరాలు 2023 స్టార్టింగ్ లో తెలుస్తాయని వినికిడి. మరి ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా షార్ట్ లిస్ట్ అయ్యింది కాబట్టి… ఈ పాట పైచేయి సాధించి ఆస్కార్ తీసుకు వస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా.. మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ఆస్కార్ తెప్పించాలని రాజమౌళి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం టీంతో కలిసి రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టించాడు అని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆస్కార్ వచ్చినా.. రాకపోయినా.. రాజమౌళి తర్వాతి సినిమాలకు అయినా ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు లభిస్తుంది.. అప్పుడైనా తన సినిమాకి ఆస్కార్ లభిస్తుంది అన్నది అతని తాపత్రయంగా తెలుస్తుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus