దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ వేడుకలలో పాల్గొనడం కోసం కీరవాణి రాజమౌళి చంద్రబోస్ కార్తికేయ ఎన్టీఆర్ రామ్ చరణ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమంలో RRR చిత్ర బృందం మొత్తం పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర బృందం చేసిన హంగామా హడావుడి ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే.అయితే ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొనడం కోసం చిత్ర బృందం మొత్తానికి ఫ్రీ ఎంట్రీ పాస్ దొరకలేదని, ఎంట్రీ పాస్ కోసం చిత్ర బృందం భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ఆస్కార్ వేడుకలలో పాల్గొనడం కోసం కేవలం కీరవాణి చంద్రబోస్ తో పాటు వీరి భార్యలకు మాత్రమే ఆస్కార్ ఫ్రీ ఎంట్రీ పాస్ లభించింది.
వీరితోపాటు పాల్గొన్నటువంటి కార్తికేయ దంపతులు రాజమౌళి దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు ఎన్టీఆర్ ప్రేమ్ రక్షిత్ వంటి వారందరూ కూడా డబ్బు పెట్టి ఆస్కార్ ఎంట్రీ పాస్ కొనుగోలు చేశారని తెలుస్తుంది. అయితే వీరందరూ కూడా ఆస్కార్ ఎంట్రీ పాస్ కొనడానికి చేసిన ఖర్చు తెలిసి ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారు. చిత్ర బృందం మొత్తం ఆస్కార్ అవార్డు తీసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాతీయ మీడియా సంస్థ అయిన ఎకనామిక్ టైమ్స్అందించిన సమాచారం ప్రకారం కీరవాణి చంద్రబోస్ దంపతులు మినహా మిగిలిన వారందరూ కూడా డబ్బులు పెట్టి ఎంట్రీ పాస్ కొన్నారని అయితే ఒక్కో టికెట్ ధర 25 వేల అమెరికన్ డాలర్ అని తెలుస్తుంది. మన భారత కరెన్సీ ప్రకారం ఒక్కో టికెట్ ధర ఏకంగా 20.6 లక్షలు అని తెలియడంతో ప్రతి ఒక్కరు ఎంతో షాక్ అవుతున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?