దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగానందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులు తెర దించుతూ ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. చాలా ఏరియాల్లో బెనిఫిట్ షోలు పడడంతో అర్ధరాత్రి నుంచే హంగామా మొదలైంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూడడానికి థియేటర్ల బాట పట్టారు.
దీంతో బెనిఫిట్ షోస్, ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరిగి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. దీంతో రిలీజ్ కి ముందే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ఎగబడ్డారు. ప్రీమియర్ షోలు చూడడానికి ఆసక్తి కనబరిచారు.
దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రీమియర్ షో కలెక్షన్స్ తో మిలియన్ల డాలర్లు రాబట్టింది ఈ సినిమా. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. ఓవర్సీస్ లో దాదాపు 3800 స్క్రీన్స్ పై ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10000 థియేటర్లలో విడుదల చేశారు. ఇండియాలో చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.
టికెట్ రేట్ ఎంతనేది చూడకుండా సినిమా టికెట్స్ కోసం ఎగబడుతున్నారు ప్రేక్షకులు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయని తెలుస్తోంది.