Prabhas, Maruthi: మారుతికి స్టార్ హీరో ప్రభాస్ ఛాన్స్ ఇస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీపావళి కానుకగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకోలేదు. కథ, కథనంలోని చిన్నచిన్న లోపాల వల్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించగా రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానని మారుతి భావిస్తున్నారు. చిరంజీవికి ఒక లైన్ వినిపించిన మారుతి భవిష్యత్తులో చిరంజీవితో ఒక సినిమా తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. చిరంజీవితో తెరకెక్కించే సినిమా కామెడీతో తెరకెక్కనుందని మారుతి పేర్కొన్నారు. అయితే మారుతి చెప్పకపోయినా ప్రభాస్ కు మారుతి ఒక కథను చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తాడో లేదో చూడాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఓకే చెప్పినా ఈ సినిమా పట్టాలెక్కడానికి రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తైన తర్వాత ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో నిజంగా నటిస్తారో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus