ఇప్పట్లో ఓ సినిమా టీవీల్లో టెలికాస్ట్ అయ్యే వరకూ ప్రేక్షకులు ఎదురుచూడడం లేదు. దాదాపు సినిమాని థియేటర్లలోనే చూసేస్తున్నారు. ఒక వేళ మౌత్ టాక్ బాగోకపోతే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లను ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. అంతేకానీ యాడ్స్ మధ్యలో ఓ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఈ విషయం తెలుసుకున్న దర్శక నిర్మాతలు శాటిలైట్ రైట్స్ ను దాదాపు ఎంతో కొంతకు అమ్మెయ్యాలనే చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ‘సాహో’ నిర్మాతలు తప్పుచేశారనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే.. ‘సాహో’ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ వారు అమ్మలేదని తెలుస్తుంది. అందుకు కారణం వారు చెప్పిన భారీ రేట్ అని తెలుస్తుంది. అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకురాలేదట. దీంతో విడుదలయ్యాక కూడా ప్లాప్ టాక్ వచ్చినా నిర్మాతలు.. రేట్లు తగ్గించట్లేదట. ఈ నేపథ్యంలో జెమినీ వారు ఎంతో ప్రయత్నించినప్పటికీ.. వీరు తగ్గలేదని తెలుస్తుంది. మరి చివరికి ఏం చేస్తారో చూడాలి..!