జోరుగా ప్రభాస్ సాహో మూవీ షూటింగ్
- June 13, 2017 / 07:18 AM ISTByFilmy Focus
బాహుబలి సినిమాలు ప్రభాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అభిమానులను ఏర్పరిచింది. వారందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత ప్రస్తుతం ప్రభాస్ పై పడింది. అందుకే ఇక నుంచి తాను తీయబోయే సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో మూవీ కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుంది. తెలుగు, తమిళం స్పష్టంగా మాట్లాడగలిగే ప్రభాస్, ప్రస్తుతం హిందీ నేర్చుకుంటున్నారు. నార్త్ అభిమానులను వదులుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా ఊరిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయింది.
హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో నీల్ నితిన్ ముఖేష్ పై ఒక సీన్ షూట్ చేశారు. ఈ చిత్రీకరణలోకి రెండు రోజుల్లో ప్రభాస్ జాయిన్ అవుతారని తెలిసింది. ఇక షూటింగ్ జోరు అందుకోనుంది. ఇక్కడ కొన్ని సీన్స్ తెరకెక్కించిన అనంతరం చిత్ర బృందం ముంబై కి వెళ్లనున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















