భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సహా యజమానిగా వ్యవహరిస్తున్న కేరళ బ్లాస్టర్ జట్టులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలు వాటాదారులు కానున్నారు. కేరళ బ్లాస్టర్ పుట్ బాల్ జట్టులో దాదాపు 40 శాతం వాటాను సచిన్ కలిగి ఉండగా.. మిగిలిన వాటాను పివిపి సంస్థ కలిగి ఉంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా పివిపి సంస్థ.. కేరళ ప్రాంచైజీ నుంచి తప్పుకోగా, ఆ స్థానంలో చిరు, నాగ్ లు వాటాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇదే విషయాన్ని అధికారికంగా సచిన్ బుధవారం తైకూడ్ లోని తాజ్ వివంత హోటల్ లో వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు వీరు ముగ్గురు కూడా బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా ఈ ఏడాది ఐఎస్‌ఎల్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. మరోవైపు చిరు ‘కత్తిలాంటోడు’ చిత్రంలో నటిస్తుండగా.. నాగ్ ‘ఓం నమో వెంకటేశ’ చిత్రంలో నటించాల్సి ఉంది.