Sai Dharam Tej: తేజు ఫోటోలు.. అందుకే బయటకు రావడం లేదా..?
- October 27, 2021 / 03:25 PM ISTByFilmy Focus
మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న అభిమానుల్లో కలుగుతోంది. ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడంతో.. తేజు పూర్తిగా కోలుకున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మొన్నామధ్య హరీష్ శంకర్ వెళ్లి చేతిలో చెయ్యి వేసిన చేతుల ఫోటో తప్ప మరొకటి బయటకు రాలేదు. సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఆయన దాదాపుగా కోలుకున్నారు.
అయితే ఫిజిక్ మాత్రం బాగా తగ్గిపోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎంత సన్నగా ఉండేవారో అంతకుమించి సన్నగా అయిపోయారట. యాక్సిడెంట్ జరగడానికి ముందు తేజు బాగా లావైన సంగతి తెలిసిందే. ఆ బరువుని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఆయన చాలా సన్నబడిపోయారట. చూసినవారు కూడా ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. మొహం మీద గాయాలు, మచ్చలు లేనప్పటికీ.. ఆయన బాడీ బాగా తగ్గిపోవడంతో ఫోటోలు బయటకు రానివ్వడం లేదట.

ఒకట్రెండు వారాల్లో ఆయన పూర్తిగా సెట్ అయిపోతారని తెలుస్తోంది. ఒకటి, రెండురోజులకు ఒకసారి గెస్ట్ లను కలుస్తున్నారట. మిగిలిన సమయం మొత్తం విశ్రాంతి తీసుకుంటున్నారట.
నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?












