Sai Dharam Tej: వరుస ప్రాజెక్ట్ లతో సాయితేజ్ బిజీ.. కానీ?

  • June 21, 2022 / 02:26 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలు చేయడం ద్వారా సంపత్ నంది పాపులారిటీని సంపాదించుకున్నారు. ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకునిగా సంపత్ నంది కెరీర్ మొదలు కాగా రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలు దర్శకునిగా సంపత్ నందికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. సినిమా ఇండస్ట్రీలో రచయితగా, నిర్మాతగా కూడా సంపత్ నంది ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే సంపత్ నంది సాయితేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సంపత్ నంది సాయితేజ్ కు కథ వినిపించగా సాయితేజ్ కు ఆ కథ బాగా నచ్చిందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయితేజ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం విక్రమార్కుడు2 సినిమాతో సంపత్ నంది బిజీగా ఉండగా ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత సాయితేజ్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రతిరోజూ పండగే సినిమా తర్వాత సాయితేజ్ హీరోగా నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సాయితేజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. మెగా హీరోలలో ఒకరైన సాయితేజ్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సాయితేజ్ మాస్ సినిమాలతో పోల్చి చూస్తే క్లాస్ సినిమాలలోనే ఎక్కువగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus