Sai Pallavi: స్టేజ్‌ మీదే ఏడ్చేసిన సాయిపల్లవి… ఎందుకంటే?

సినిమా వాళ్లు చూడటానికి స్ట్రాంగ్‌గా కనిపిస్తారు కానీ… చిన్న విషయానికే ఎమోషనల్‌ అయిపోతారు అంటుంటారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది సాయిపల్లవి. ఈ తరం కథానాయికల్లో సహజ నటి అనిపించుకుంటున్న సాయిపల్లవి త్వరలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఆ వేదికపై సాయిపల్లవి చేసిన పనిని చూసి ఓవైపు అభిమానులు ఆనందపడుతుంటే, మరోవైపు ఏంటి ‘సాయిపల్లవి అంత ఎమోషనలా?’ అని అనుకుంటున్నారా. ఇంతకీ ఏమైందంటే.

‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్టేజీ మీద మాట్లడటానికి దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ సిద్ధమయ్యారు. సినిమా గురించి, హీరో గురించి మాట్లాడుతూ… హీరోయిన్‌ సాయిపల్లవి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు, అభిమానులు ఆమె పేరు మారుమోగేలే కేరింతలు కొట్టారు. హీరో పేరు ఎత్తితే ఏ రేంజిలో అభిమానులు అరుపులు మొదలుపెడతారో అలా అరిచారు. దీంతో సాయిపల్లవి ఎమోషనల్‌ అయ్యింది. తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి.

ఈ మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎమోషనల్‌ అవుతున్నాను. ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా మాటలు రావడం లేదు అని చెప్పింది సాయిపల్లవి. నన్ను నేను నటిగా నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఇండస్ట్రీకి నా థ్యాంక్స్‌. నన్ను నమ్మి అవకాశాలు ఇస్తున్న డైరక్టర్లకు కూడా. కెరీర్‌లో జాతీయ పురస్కారం అందుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటానని అనుకున్నాను. కానీ నటిగా ఈ స్టేజ్‌పై ఉండటమే ఓ పెద్ద పురస్కారమని ఈరోజు అర్థమైంది. అందుకే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్‌ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

నటనతో ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయపల్లవి… ఇలా స్టేజీ మీదే భావోద్వేగానికి గురవ్వడం చూసి ప్రేక్షకులు, అభిమానులు కూడా కాస్త ఎమోషనల్‌ అయ్యారు. ఇక ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సంగతికొస్తే… ఈ సినిమాను ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలో నటిస్తోంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus