నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. శ్యామ్ సింగరాయ్ తో నాని బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయమని నాని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ట్యాక్సీవాలా సినిమా సక్సెస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సాయిపల్లవి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి సినిమాలో భిన్నమైన పాత్రలో నటించి మెప్పించే సాయిపల్లవి మెప్పిస్తున్నారు. వివాదాలకు కూడా సాయిపల్లవి దూరంగా ఉంటారని తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ లో కృతిశెట్టి, సాయిపల్లవితో పాటు మడోన్నా సెబాస్టియన్ కూడా నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు శ్యామ్ సింగరాయ్ యూనిట్ హాజరు కాగా సాయిపల్లవి నానికి ఒకవైపు కృతిశెట్టి మరోవైపు కూర్చున్నారు. ఆ తర్వాత మడోన్నా సెబాస్టియన్ అక్కడికి వచ్చారు. సాయిపల్లవి వెంటనే తను కూర్చున్న కుర్చీ నుంచి లేచి మడోన్నా సెబాస్టియన్ కు సీట్ ఇచ్చారు.
సాధారణంగా ఇది మనకు చిన్న విషయమైనా సాయిపల్లవి లాంటి హీరోయిన్లు ఇలాంటి త్యాగం చేయాల్సిన అవసరం లేదు. శ్యామ్ సింగరాయ్ లో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అయితే ఇతరుల గురించి ఆలోచించి వాళ్లకు కూడా మంచి క్రెడిట్ దక్కేలా చేయడంలో సాయిపల్లవి ముందువరసలో ఉంటారు. సాయిపల్లవి చేసిన త్యాగానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డౌన్ టు ఎర్త్ ఉంటూ తను హీరోయిన్ అనే గర్వాన్ని అస్సలు ప్రదర్శించని హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు.
తోటివాళ్లకు సాయం చేసే విషయంలో ఆమె ముందువరసలో ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నాలుగు భాషల్లో శ్యామ్ సింగరాయ్ రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్యామ్ సింగరాయ్ యూనిట్ పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం. 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!