Sai Pallavi: పుట్టపర్తిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న నటి!

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి తరుణంలో ఎంతో మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లి ఘనంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన సంగతి మనకు తెలిసిందే. అయితే నటి సాయి పల్లవి మాత్రం చాలా భిన్నంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈమె నూతన సంవత్సర వేడుకలను పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయిబాబా మందిరంలో జరుపుకున్నారు. ఈమె పుట్టపర్తి సాయిబాబాను ఎంతో విశ్వసిస్తారు అనే విషయం మనకు తెలిసిందే. ఇక తన తల్లిదండ్రులకు పిల్లలు పుట్టకపోవడంతో సాయిబాబాను పూజించడం వల్ల తాను పుట్టానని అందుకే నా పేరుకు ముందు సాయి అని చేర్చారు అంటూ సాయి పల్లవి తెలియజేశారు.

ఇక ఈమెకు వీలైనప్పుడల్లా పుట్టపర్తి సాయిబాబా మందిరాన్ని దర్శించుకుంటారు అనే సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా ఈమె నూతన సంవత్సర వేడుకలను పుట్టపర్తి లోనే జరుపుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి ఈ ఏడాది కూడా పుట్టపర్తిలో తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈమె (Sai Pallavi) సింప్లిసిటీ ఫిదా అవుతున్నారు.

అందరూ పార్టీలంటూ పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోగా ఈమె మాత్రం ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ తన ఇష్ట దైవం సాయిబాబా మందిరంలో ఇలా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడంతో అందరూ కూడా సాయి పల్లవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్నటువంటి తండేల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus