Sai Pallavi Marriage: వివాహంపై కాస్త క్లారిటీ ఇచ్చిన హైబ్రీడ్‌ పిల్ల!

కెరీర్‌ హై ఫ్లోలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే హీరోయిన్లు టాలీవుడ్‌లో తక్కువగా ఉంటారు. కానీ బాలీవుడ్‌కి ఇది కొత్తేం కాదు. గతంలో చాలామంది నాయికలు ఇలానే పెళ్లి చేసుకొని కెరీర్‌ను కంటిన్యూ చేశారు. మన దగ్గర కూడా అలాంటి నాయికలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు. వీరి కోవలోకే సాయిపల్లవి చేరాలని అనుకుంటోందా? ఆమె మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. అవును సాయిపల్లవి పెళ్లికి రెడీ అవుతోంది. ఆమె చెప్పినట్లుగా చేస్తే వచ్చే ఏడాది ఆమె పెళ్లి అయిపోవచ్చు. ఇదేం లాజిక్‌ అంటారా.

సాయిపల్లవి గతంలో చెప్పిన ఓ మాట, ఇప్పుడు ఆమె లైనప్‌ చూస్తే ఈ డౌట్‌ వస్తోంది. అదేంటంటే… 30 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తా అని గతంలో ఓ సందర్భంలో చెప్పింది, ఇటీవల కూడా చెప్పినట్లు గుర్తు. అయితే … ఇప్పుడు ఆమె వయసు 29. వచ్చే ఏడాది 30 అవుతుంది. అంటే ఆమె పెళ్లికి సిద్ధమైనట్లే కదా. అంతేకాదు వచ్చే ఏడాది సాయిపల్లవి ఏ సినిమాలు చేస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఆమె కొత్త సినిమాలను ఓకే చేయడం లేదని టాక్‌. ప్రస్తుతం ఆమె చేతిలో ఎప్పుడో పూర్తయిపోయిన ‘విరాటపర్వం’ ఒక్కటే ఉంది.

దీంతో ఈ రెండు విషయాలను కలిపేసి వచ్చే ఏడాది సాయిపల్లవి పెళ్లి జరగడం పక్కా అని అంచనాలు వేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత పల్లవి సినిమాలు చేస్తుందా? లేదా? అనేది అప్పుడు తేలుతుంది. బాలీవుడ్‌ హీరోయిన్లలాగా దేని పని దానిదే అని అనుకుంటుందా? లేక నజ్రియా లాగా కొన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి. ఈలోపు సోదరి పూజా కన్నన్‌ కెరీర్‌ను నిలబెట్టే పనుల్లో ఉందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

పూజా కన్నన్‌ ఇటీవల ‘చిత్తిరాయి సెవ్వనమ్‌’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి పేరు కూడా సంపాదించింది. అక్క లాగే చెల్లి కూడా తొలి సినిమాతోనే అదరగొట్టేసింది అనే టాక్‌ వినిపించింది. ఆ తర్వాత పూజ ఏ సినమా చేస్తుంది అనే విషయంలో సరైన స్ఫష్టత లేదు. సో చెల్లి రాక, అక్కడ గ్యాప్‌ పక్కా అనుకోవచ్చా?

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus