Sai Pallavi: సాయిపల్లవి ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతుందా?

కొన్ని నెలల క్రితం వరకు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో సాయిపల్లవి వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. అయితే వరుసగా హిట్లు అందుకుంటున్న సమయంలోనే సాయిపల్లవి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. సాయిపల్లవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు రాకపోవడంతో సాయిపల్లవికి ఏమైందని ఆమె ఎక్కడున్నారని ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి సినిమాలకు దూరమై ప్రేక్షకులకు షాక్ ఇస్తారా? అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.

సాయిపల్లవి కనీసం సోషల్ మీడియాలో అయినా అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియా అంతటా సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయిపల్లవి వ్యక్తిత్వం వల్లే ఆమెకు ఈ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారని చెప్పవచ్చు. మంచి కథల కోసమే సాయిపల్లవి ఎదురుచూస్తున్నారని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయిపల్లవి యాడ్స్ లో నటించడానికి కూడా ఆసక్తి చూపరనే సంగతి తెలిసిందే. తను ఉపయోగించని ఉత్పత్తులను ఎందుకు ప్రచారం చేయాలనే ఆలోచనతో సాయిపల్లవి యాడ్స్ కు దూరంగా ఉన్నట్టు బోగట్టా.

స్టార్ హీరోయిన్ అయిన సాయిపల్లవి గ్యాప్ తీసుకోవడం సరికాదని మరి కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటికే పరిమితమయ్యారని ఆమె ఫ్యాన్స్ లో కొందరు చెబుతున్నారు. సైలెంట్ మోడ్ లో ఉన్న సాయిపల్లవి తనను మెప్పించే కథ వచ్చేవరకు సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కథ నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ కు సినిమాలు చేయడానికి సాయిపల్లవి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

సాయిపల్లవి మదిలో ఏముందో తెలియాలంటే మాత్రం ఆమె స్పందించే వరకు ఆగాల్సిందే. సాయిపల్లవి నటించిన విరాటపర్వం రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus