ఈ ఏడాది విడుదలైన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించినా మరీ భారీ రికార్డులను సొంతం చేసుకోలేదు. అయితే సలార్ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొనగా బిజినెస్ విషయంలో ఈ సినిమా సంచలనాలు కొనసాగుతున్నాయి. 90 కోట్ల 6 లక్షల రూపాయలకు సలార్ మూవీ నైజాం రైట్స్ ను మైత్రీ నిర్మాతలు సొంతం చేసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తంలో 65 కోట్ల రూపాయలు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కాగా మిగతా మొత్తం రిఫండబుల్ అడ్వాన్స్ గా ఉంది.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. నైజాంలో ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించిన సినిమాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రభాస్ సినిమాకు దాదాపుగా 250 కోట్ల రూపాయల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బిజినెస్ జరగడం గమనార్హం. సలార్ సినిమాలో యాక్షన్ సీన్లు ఒకింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ రెండేళ్ల కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సలార్1 మూవీకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే సలార్2 సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది. సలార్2 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీని షేక్ చేసే స్క్రిప్ట్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆకట్టుకునేలా ఉండనున్నాయని తెలుస్తోంది.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తే మాత్రం సలార్ ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.