ప్రభాస్ – ప్రశాంత్ నీల్.. కాంబినేషన్లో రూపొందిన ‘సలార్'(‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉన్నాయి అని చెప్పాలి. కానీ.. గత రెండు రోజుల్లో అంటే 6వ రోజు, 7వ రోజు తగ్గాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ముందుగా.. అవి వీక్ డేస్ అనేది ఒక కారణమైతే, రెండోది టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం ఇంకో కారణంగా చెప్పుకోవాలి.
రోజంతా పని చేసి సాయంత్రానికి సినిమాకి వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకి టికెట్ రేట్లు రూ.410 అలా ఉంటే.. ‘భయం వేయదూ?’ ‘సలార్’ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ‘సలార్’ థియేటర్ కి వెళ్లి చూడాలనుకునే అలాంటి ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్. ఈరోజు అంటే డిసెంబర్ 29 నుండి ‘సలార్’ (Salaar) టికెట్ రేట్లు తగ్గాయి.
మల్టీప్లెక్సుల్లో మొన్నటి వరకు రూ.410 వరకు ఉన్న టికెట్ రేటు ఇప్పుడు రూ.295 కి తగ్గింది. ఇంకొన్ని మల్టీప్లెక్సుల్లో రూ.350 వరకు ఉంది. ఇక సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే.. నిన్న మొన్నటి వరకు రూ.260 అలా ఉన్న టికెట్ రేట్లు.. ఇప్పుడు రూ.175 , రూ.150 గా ఉన్నాయి. సెకండ్ వీకెండ్ కి ఎక్కువ ‘ఫుట్ ఫాల్స్’ పడటానికి ఇదొక కారణమవ్వచ్చు.
అలాగే సోమవారం నాడు న్యూ ఇయర్ హాలిడే కూడా ఉంది కాబట్టి.. ఇంకా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. రెండో వీకెండ్ తో కొన్ని ఏరియాల్లో ‘సలార్’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి వరకు టైం ఉంది కాబట్టి.. మిగిలిన చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు.