సల్మాన్ ఖాన్ తండ్రి ప్రముఖ రచయిత అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆయన పేరు సలీం ఖాన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకానొక సమయంలో పేరు మార్చుకున్నారని తెలుసు. అవును ఆయన తన జీవితంలో కీలకమైన విషయం కోసం తన పేరును సలీం శంకర్‌గా మార్చుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు అర్భాజ్ ఖాన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా సలీం ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
బాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌గా ఆ తర్వాత నిర్మాత అదిరిపోయే సినిమాలు చేశారు సలీమ్ ఖాన్. అతని వారసులుగా ముగ్గురు కొడుకులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో ఒకడు సల్మాన్ ఖాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అర్భాజ్ ఇంటర్వ్యూ కార్యక్రమం ‘ది ఇన్విన్సిబుల్స్’కు సలీమ్ ఖాన్ హాజరయ్యారు. ఈ క్రమంలో తన పెళ్లినాటి విషయాలు చెప్పుకొచ్చారు సలీం ఖాన్. తన భార్య సుశీల చరక్ కుటుంబం మొదట్లో తమ వివాహానికి అభ్యంతరం చెప్పిందని తెలిపారు.
సుశీల చరక్‌ది హిందూ మతం కావడంతో, ముస్లీం అబ్బాయి అయిన తనకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదని సలీం ఖాన్ వెల్లడించారు. “సుశీలా చరక్‌ను ఇప్పుడు సల్మా ఖాన్ అని పిలుస్తున్నాం. తను సంపన్న మహారాష్ట్ర హిందూ కుటుంబంలో పెరిగింది. అయితే మేం ఇద్దరం ప్రేమలో పడ్డాం. నాతో మతాంతర వివాహానికి ఆమె కుటుంబం వ్యతిరేకించింది. దీంతో నేను వారి పెద్దలను కలవడానికి వెళ్లాను’’ అని నాటి విషయాలు చెప్పుకొచ్చారు.
వాళ్ల ఇంట్లో అందరూ తనను జంతు ప్రదర్శనశాలలో కొత్త జంతువును చూసినట్లు చూశారని సలీం ఖాన్ తెలిపారు. అప్పుడు మా మా మామగారు మీరు చదువుకున్నారు. మంచి కుటుంబం నుండి వచ్చారు. మీ అంత మంచి అబ్బాయి మరొకరు మాకు మళ్లీ దొరక్కపోవచ్చు. కానీ, మీ మతం మాకు ఓకే కాదు అని చెప్పారు అని సలీం ఖాన్ తెలిపారు. దీంతో పెళ్లి కోసం సలీం ఖాన్ అనే పేరును శంకర్‌గా మార్చుకున్నారట. అదన్నమాట పేరు మార్పు వెనుక జరిగిన విషయం.