Salman Khan: ఇకపై నేను సినిమాలు చేయాల్సిన పనిలేదు: సల్మాన్ ఖాన్

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరవ సీజన్ కొనసాగుతోంది. తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ రియాలిటీ షో హిందీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో తొందరలోనే 16వ సీజన్ కూడా ప్రారంభం కానుంది.

ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 16 కి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సీజన్ 16 కోసం సల్మాన్ ఖాన్ భారీ స్థాయిలో రూ. 1000 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మీడియా ముందుకి వచ్చిన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ…తన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతు.. నేను బిగ్ బాస్ షో చేస్తున్నానా ? లేదా ? అని అందరూ పదే పదే అడగడంతో చాలా విసుగు వస్తోంది. ఇలా అడగటంతో నేను హోస్ట్ గా ఉండను అని చెప్పేశాను.

ఇక వాళ్లకు వేరే చాయిస్ లేక నన్ను హోస్ట్ చేయమని అడిగారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. నేనురూ. 1000 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే జీవితంలో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. అంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నన్ను ఎప్పటికీ గమనిస్తూనే ఉండేవారు అంటూ ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus