చైసామ్ సాహస యాత్రకు కారణం అదే..!

నాగ చైతన్య, సమంత ఫోటో ఒకటి.. సోషల్ మీడియాలో గత మూడు, నాలుగు రోజులుగా తెగ వైరల్ అవుతూ వస్తుంది. ఈ ఫొటోలో వీరిద్దరూ బైక్ పై ఉన్నారు. అయితే సమంత మాస్క్ ధరించకపోవడం, లాక్ డౌన్ టైములో ఇలా బయటకు రావడమేంటి అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అంటూ కొన్ని సడలింపులు.. చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వీరిద్దరూ బయటకి వచ్చారని తెలుస్తుంది.

అంతేకాదు వీరు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కాదు ఏకంగా చెన్నై వరకూ బైక్ పై వెళ్ళి వచ్చారట. ఓ ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకావాల్సి వచ్చి ప్రభుత్వం నుండీ పెర్మిషన్ తీసుకునే వెళ్ళారని తెలుస్తుంది. అయితే అంత అర్జెంటుగా.. అందులోనూ ఇలా బైక్ పై వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్టు అనే డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నాడు.

లాక్ డౌన్ లేనట్టు అయితే ఈపాటికే సినిమా విడుదలయ్యేది. దీని తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి కూడా చైతన్య రెడీ అవుతున్నాడు. ఇక సమంత ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో పలకరించింది. త్వరలో ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus