Samantha: ‘థ్యాంక్యూ మై లవ్’ అంటూ అభిమాని గురించి సమంత చేసిన పోస్ట్ వైరల్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి పనిలో బిజీ అయిపోయింది.. మయోసైటిస్ కారణంగా షూటింగులకు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ‘శాకుంతలం’ డబ్బింగ్ కంప్లీట్ చేసింది.. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల డిలే అయింది.. ఎట్టకేలకు పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజ్‌కి‌ రెడీ అవుతోంది.. రీసెంట్‌గా సామ్ ‘శాకుంతలం’ సినిమా చూసింది.. ఫస్ట్ కాపీ రెడీ అవగానే నిర్మాత దిల్ రాజు, గుణ శేఖర్ ఆమెకు ప్రివ్యూ వేశారు..

అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.. ఇదిలా ఉంటే ఇటీవల సామ్ తన చేతులకు గాయాలైన పిక్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అందరూ హీరో, హీరోయిన్ల ముఖాలను ఆర్ట్స్ వేస్తే.. ఓ సమంత అభిమాని మాత్రం దెబ్బ తగిలిన సామ్ చేతులను అందంగా గీసింది.. అంతేకాదు.. మంచి బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా చేసింది.. ‘‘నేను నీ సక్సెస్‌కి మాత్రమే ఫ్యాన్‌ని కాదు.. నీ హార్డ్ వర్క్, కమిట్‌మెంట్ మరియు కైండ్ నెస్‌కి హ్యూజ్ ఫ్యాన్‌ని..

దీన్ని నువ్వు 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాను.. కానీ నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇవ్వలేకపోయాను.. ఫైనల్‌గా ఇప్పుడిస్తున్నాను మై లవ్.. నీకిది నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ పోస్ట్ చేసింది.. అభిమాని చేసిన ఆ పోస్ట్ చూసిన సమంత ‘థ్యాంక్యూ మై లవ్’ అంటూ రియాక్ట్ అవడమే కాకుండా.. ఆమెను మెన్షన్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పెషల్ స్టోరీని కూడా షేర్ చేసింది సమంత..

‘ది ఫ్యామిలీ మెన్ – 2’ తర్వాత బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ పక్కన ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది సామ్.. ఇటీవలే పెండింగ్ ఉన్న ‘ఖుషి’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడింది.. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రం త్వరలో పూర్తి కానుంది.. తర్వాత ఓ హాలీవుడ్ మూవీ కూడా కమిట్ అయింది సామ్..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus