టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంతకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే.. నవంబర్ 20 నుంచి 28వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్ కు సమంతను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమెను ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. డైరెక్టర్ అరుణ్ రాజ, నటుడు జాన్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి,
వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి లాంటి వారితో పాటు సమంతని కూడా స్పెషల్ స్పీకర్‌గా ఇన్వైట్ చేశారు. సౌత్ ఇండియా నుంచి ఓ నటికి ఈ అవకాశం రావడమనేది ఇదే తొలిసారి. దాన్నిబట్టి సమంత క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. నటిగానే కాకుండా.. సామాజిక సేవా కార్యకర్తగా కూడా గుర్తించి సమంతను ఆహ్వానించారట. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సినిమాలతో పాటు సామాజిక సేవపై కూడా దృష్టి పెట్టింది సమంత. ఎంతోమందికి సాయపడింది.
ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి విరాళాలు ఇచ్చింది. ప్రత్యూష ఫౌండషన్ ను ఏర్పాటు చేసి ఎందరో చిన్నారులకు అండగా నిలిచింది. నటిగానే కాకుండా మంచి మనిషిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమెని ఇలా గౌరవించబోతున్నారు.