అమ్మో సమంతకు.. కార్లంటే అంత పిచ్చా…!

సమంత అక్కినేని … నాగ చైతన్య ను పెళ్ళి చేసుకున్నాక ఈమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై బ్యూటీ .. తొలి రెండేళ్ళ లోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో.. అటు గ్లామర్ కు… అలాగే సినిమా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ… బిజీగా ఉండేది బ్యూటీ. మధ్యలో కొన్ని ప్లాప్ లు ఎదురైనా … కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా.. ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక చైతన్యను పెళ్ళి చేసుకున్నాక.. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అలాగే కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలనే చేస్తూ ముందుకు సాగుతుంది. ఈమె సంపాదన కూడా అదే రేంజ్ లో ఉందనుకోండి. ఇదిలా ఉంటే.. సమంతకు కార్లు అంటే మహా పిచ్చట.

తాజాగా సమంత…. BMW X5 కారును కొనుగోలు చేసిందట. ఈ కారు ధర అక్షరాల 76 లక్షల రూపాయలు. ఇది బుల్లెట్ ప్రూఫ్ అట. 100 కి.మీల వేగాన్ని కేవలం 5 సెకన్ల లో అందుకునే కెపాసిటీ ఉన్న కారు ఇదని తెలుస్తుంది.

దీంతో పాటు సమంత దగ్గర… జాగ్వార్ XF అనే మరో లగ్జరీ కారు ఉంది. ఈ కారు ధర 62 లక్షలు అని తెలుస్తుంది.కొత్త కారు కొనే ముందు వరకూ సమంత ఈ కారునే వాడేదట.

అంతేకాదు ఆడీ క్యూ 7 అనే మరో కారు కూడా సమంతకు ఉంది. ఈ కారు 78 లక్షల రూపాయలు ఉంటుందట. ఇండియాలో ఎక్కువ మంది కొనుగోలు చేసే కారు ఇదని తెలుస్తుంది. ఎన్నో అడ్వాన్స్ ఫీచర్స్ తో ఈ కారు ఉంటుందని తెలుస్తుంది.

పైనున్న వన్నీ ఒక ఎత్తు అయితే…1 కోటి 15 లక్షల విలువ చేసే పోర్షే కేమ్యాన్ జేటీఎస్ కారు మరొక ఎత్తు. ఎంతో ఇష్టపడి సమంత ఈ కారు కొనుగోలు చేసిందట.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus