టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య సమంత నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో సమంతకు తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీగా పెరిగిపోయింది. ఇలా సమంతకు ఈ సినిమా ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇకపోతే తాజాగా సమంత ఏం మాయ చేసావే సినిమా గురించి గుర్తుచేసుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆదివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈమె న్యూయార్క్ పరెడ్ లో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మేరకు ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. న్కూయార్క్ నగరం కలల సాకారానికి అనువైనదిగా చెబుతుంటారు. నా తొలిచిత్రం షూట్ ఇక్కడే జరిగింది. నటిగా నా కెరీర్ మొదలైంది. ఆ సమయంలో ఈ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియక భయపడిన చిన్నపిల్లని నేను.
గొప్ప కలలతో ధైర్యంగా అడుగు ముందుకు వేశా. 14ఏళ్ల తర్వాత తిరిగి ఇండిపెండెన్స్ డే ఫరైడ్ లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలలో భాగంగా న్యూయార్క్ పర్యటలో జరిగినటువంటి కార్యక్రమానికి సమంత ముఖ్యఅతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో సమంతా (Samantha) పాల్గొంటూ సందడి చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత తాజాగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.