“ఓ స్త్రీ రేపురా” అనే ఫినామినాన్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఆంధ్రాలో ఈ రచ్చ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. తెలంగాణలో ఈ “ఓ స్త్రీ రేపురా” అనే పదం భీభత్సంగా పాపులర్. ఒక 20 ఏళ్ల అమ్మాయిని కొందరు పెళ్లి చేసుకోనివ్వకుండా హత్య చేశారనే కోపంతో ఆమె దెయ్యంగా మారి యువకులను ఎత్తుకెళ్లిపోయేదని, అలా జరగకుండా ఉండేందుకు ఇంటికి “ఓ స్త్రీ రేపు రా” పెయింట్ చేసేవారు జనాలు. ఈ ఇష్యూ కొన్నాళ్ళ తర్వాత సైలెంట్ అయిపోయిందనుకోండి. ఇదే ఇష్యూను బేస్ చేసుకొని బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న టాలీవుడ్ కి చెందిన దర్శకనిర్మాతలు రాజ్ & డీకేలు “స్త్రీ” అనే బాలీవుడ్ సినిమాను రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా సాధించిన బంపర్ హిట్ కు బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా షేక్ అయ్యింది. హిలేరియస్ కామెడీ హారర్ ఫిలిమ్ గా రూపొందిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు-శ్రద్ధాకపూర్ లు జంటగా నటించగా.. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు మన దర్శకనిర్మాతలు.
ఇటీవల “యు టర్న్” చిత్రంతో మంచి హిట్ అందుకొన్న సమంత ఈ హారర్ కామెడీలో నటించనుందట. తన కెరీర్ లో ఇప్పటివరకూ చాలా డిఫరెంట్ రోల్స్ చేసిన సమంతకు హారర్ కామెడీ చేయలేకపోయానని బాధ మాత్రం ఉండిపోయింది. అందుకే కొత్తగా ఉంటుందని ఈ రీమేక్ లో నటించడానికి అంగీకరించిందట. స్త్రీ ప్రధాన పాత్రలు చేయడానికి సుముఖత చూపుతున్న సమంతకి ఈ “స్త్రీ” రీమేక్ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎప్పట్నుంచి సెట్స్ కి వెళ్తుంది అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.