Samantha: డేటింగ్ రూమర్స్.. చైతన్య ఫ్యాన్స్ పై ఫైర్ అయిన సమంత..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత విడాకులు అనంతరం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. ‘శాకుంతలం’ ‘యశోద’ వంటి చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ సినిమాల్లో కూడా ఈమె ప్రాముఖ్యమైన పాత్రలు చేయడానికి ఓకే చెబుతుంది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్, ఇంటిమేట్ సీన్లు చేయడానికి వెనకాడటం లేదు. సమంత తీసుకున్న కొత్త స్టెప్ వల్ల ఆమె క్రేజ్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

మరోపక్క నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఓ స్టార్ హోటల్ లో స్టే చేస్తున్న నాగ చైతన్య మరో పక్క తన కొత్త ఇంటి నిర్మాణం పనులు చూసుకుంటూ మరింత బిజీ అయిపోయాడు. అయితే గత రెండు రోజులుగా హీరోయిన్ శోభిత ధూళిపాళ తో నాగచైతన్య డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదు అనేది ఆ వార్తల సారాంశం.

ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ విషయం తో సంబంధం లేని సమంతని లాగి కొంతమంది నెటిజన్లు ఆమె పై ఇష్టమొచ్చిన కామెంట్లు చేయడంతో ఈ టాపిక్ కాస్త చర్చనీయాంశం అయ్యింది. ఈ మధ్య కాలంలో సమంతని అనవసరంగా అన్ని విషయాల్లోకి లాగుతున్నారు కొంత మంది నెటిజన్లు. మొన్నటికి మొన్న ఓ నెటిజన్.. సమంతని ‘వేశ్య’ అని ‘ఆమె కోసం చైతూ వెయిట్ చేయడం ఏంటని?’ కామెంట్ చేయడం వారి మానసిక స్థితి ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది.

మరికొంతమంది అయితే ‘శోభితా ధూళిపాళతో చైతన్య ఏమీ సహజీవనం చేయడం లేదు, సమంతే ఈ రూమర్స్ ని క్రియేట్ చేస్తుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి సమంత.. ‘అమ్మాయిల పై పుకార్లు వస్తే నిజం.. అదే అబ్బాయిల పై వస్తే అమ్మాయిలే ఆ పుకార్లు పుట్టించినట్లా..? ఇకనైనా మారండి అబ్బాయిలు… మేము మూవ్-ఆన్ అయిపోయాం. మీ పని మీరు చూసుకోండి. మీ కుటుంబాల గురించి పట్టించుకోండి’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus