Samantha: షూటింగ్లో గాయపడ్డ సమంత వైరల్ అవుతున్న ఫోటో!

  • February 28, 2023 / 11:49 PM IST

సమంత కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ అటు తర్వాత నయనతారలా రూటు మార్చి సినిమాకి ప్రాముఖ్యత కలిగిన పాత్రలు పోషిస్తూ వస్తోంది. అలా ఈమె రూటు మార్చినప్పటి నుండి క్రేజ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. ఇక మొన్నామధ్య సమంత పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈమె అనారోగ్యం పాలైంది కూడా..! ‘యశోద’ సినిమా రిలీజ్ టైంలో ఈమె మాయోసైటిస్ తో బాధపడుతున్నట్లు తెలిపి షాకిచ్చింది.

ఆ టైంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ప్రమోషన్ కూడా చేసింది. అలా రియల్ లైఫ్ లో కూడా ఓ ఫైటర్ అని ప్రూవ్ చేసుకుంది సమంత. ఫలితంగా సినిమా హిట్ అయ్యింది. మరోపక్క ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసి ప్రమోషన్స్ కు రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా… మరోసారి సమంత గాయాలపాలైంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో సమంతకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన రాజ్ అండ్ కె దర్శకులతో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది.

ఈ సిరీస్ లోని యాక్షన్ సన్నివేశాల షూటింగ్లో పాల్గొన్న సమంతకి గాయాలు అయ్యాయి. తన రెండు చేతులకు గాయాలైనట్లు ఫోటోని షేర్ చేసిన సమంత ‘పర్క్స్ ఆఫ్ యాక్షన్’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus