Samantha: ప్రేమకు అర్థం మారిపోయిందన్న సమంత.. ఏం చెప్పారంటే?

  • April 10, 2023 / 06:36 PM IST

స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా వేర్వేరు అంశాల గురించి స్పందిస్తుండగా తాజాగా ప్రేమ గురించి ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా లైఫ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసని నా జీవితం తెరిచిన బుక్ అని సమంత చెప్పుకొచ్చారు. నా లైఫ్ లో ఎత్తుపల్లాలను పారదర్శకంగా అందరూ చూడొచ్చని ఆమె కామెంట్లు చేశారు. కొంతమంది కొన్ని విషయాలను దాచిపెట్టడం ఫేక్ గా ఉండటం చేస్తారని అలా చేయడం వల్ల వాళ్లకే నష్టం కలుగుతుందని సామ్ అన్నారు.

నిజాలను దాచడం వల్ల వాళ్లకు తెలియకుండానే చాలా ఒత్తిడి వస్తుందని నాకు ఆ సమస్య లేదని నా జీవితం తెరిచిన పుస్తకం అని సమంత పేర్కొన్నారు. నా దృష్టిలో లవ్ కు అర్థం మారిపోయిందని అయితే మంచిగానే మారిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇన్నిరోజులు నేను ప్రేమను ఇచ్చానని కానీ లైఫ్ లో తొలిసారిగా ప్రేమను చూస్తున్నానని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా అభిమానులు నాకు ఇస్తున్న ప్రేమ చాలా ఎక్కువని సమంత పేర్కొన్నారు.

ఇంత ప్రేమను (Samantha) నా లైఫ్ లో చూడలేదని ఆమె కామెంట్లు చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నల గురించి ఆమె ఈ విధంగా కామెంట్లు చేశారు. శాకుంతలం రిలీజ్ కు మరో నాలుగు రోజుల సమయం ఉండగా గతంలో ఏ సినిమా కోసం కష్టపడని స్థాయిలో ఆమె ఈ సినిమా కోసం కష్టపడటం ద్వారా వార్తల్లో నిలిచారు. శాకుంతలం సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అల్లు అర్హ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. రిలీజ్ తర్వాత శాకుంతలం మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. సమంత కెరీర్ ను ఒక విధంగా ఈ సినిమా డిసైడ్ చేయనుంది. త్వరలో సమంత మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus