Yashoda Teaser: గర్భిణీ స్త్రీగా సమంత.. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ ఇస్తుందిగా..!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘శ్రీదేవి మూవీస్’ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి స్పందన లభించింది.ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ విషయానికి వస్తే.. సమంత ఈ చిత్రంలో యశోద(టైటిల్ రోల్) పాత్రలో ఓ గర్భిణీ స్త్రీగా కనిపిస్తుంది. ఆమె గర్భిణీ కాబట్టి డాక్టర్ కొన్ని జాగ్రత్తలు చెబుతుంటే మరోపక్క ఆమె ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఈ టీజర్లో చూపించారు. మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి అంటున్నప్పుడు ఆమె కడుపులో శిశివుకి ఏదో జరిగినట్టు చూపించారు. తర్వాత టైంకి నిద్రపోవాలి అని చెబుతుంటే అసలు ఆమెకు నిద్రపట్టకుండా ఉన్నట్టు చూపించారు.

జాగ్రత్తగా నడవాలి అని చెబుతుంటే ఆమెను కుక్కలు వెంటాడుతుంటే పరిగెత్తినట్టు చూపించారు. అలాగే యశోద ని గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా ఎవరో కొడుతున్నట్టు కూడా చూపించారు. చివరికి ఆమె గర్భం నిలబడిందా? లేదా ? అన్న సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ టీజర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. కొన్ని విజువల్స్ చూస్తుంటే భయానకంగా అనిపిస్తున్నాయి.

‘యశోద’ పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ ముందు నుండి చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ టీజర్ ఉంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus