తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటిగా ఈమె పలు తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా తొందరగా స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు అయితే అంతే తొందరగా ఈమె ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి సమీరా రెడ్డి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
ఇకపోతే సమీరా రెడ్డి చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన పెళ్లి సమయంలో వచ్చినటువంటి వార్తల గురించి స్పందించారు. అలాగే బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నేను 2014 సంవత్సరంలో అక్షయ్ తో వివాహం మా ఇంటి టెర్రస్ పై జరుపుకున్నాను.
ఇలా మా ఇంటి టెర్రస్ పై మా వివాహం చాలా సింపుల్ గా జరగడంతో చాలామంది మా పెళ్లి గురించి మాట్లాడుతూ తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం వల్ల ఇలా హడావిడిగా పెళ్లి చేసేసాము అంటూ చాలామంది మాట్లాడారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని మాది పెద్దలు కుదిర్చిన వివాహమని సమీరారెడ్డి తెలిపారు. ఇక తనకు మొదటి బాబు జన్మించిన తర్వాత కొన్ని సమస్యల కారణంగా నేను అధికంగా శరీర బరువు పెరిగిపోయానని తెలిపారు.
ఈ విధంగా తాను అధిక శరీర బరువు పెరగడంతో చాలామంది తన పట్ల బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారని తెలిపారు.ఆ ట్రోల్స్ కి భయపడి ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడే దానిని కాదని తెలిపారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా మేడం మీరేనా అసలు ఇలా తయారయ్యారేంటి అంటూ మాట్లాడటంతో చాలా బాధేసిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇలాంటి విషయాల గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ఈ సందర్భంగా (Sameera Reddy) సమీరా రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.