ఏ భాషలో మంచి కథతో సినిమా తీసినా…దానిని తెలుగు ప్రేక్షకులకి అందించడానికి పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ తో సహా ఇప్పటివరకు పవన్ 10 కి పైగా రీమేక్ సినిమాల్లో నటించారు. ‘తేరి’ అనే రీమేక్ సినిమాలో కూడా పవన్ నటిస్తారట. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. అక్కడి వరకు ఓకె. కానీ ‘వినోదయ సీతం’ కూడా పవన్ రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
కానీ ఆ ప్రాజెక్టు గురించి ఎటువంటి వార్తలు రాకపోయేసరికి అంతా రిలాక్స్ అయ్యారు. నిజానికి ఈ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. పైగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో చేసే రీమేక్ కాదు ఇది. ‘ఆ నలుగురు’ ‘గోపాల గోపాల’ వంటి సినిమాలను మిక్స్ చేసి జ్యూస్ తీసినట్టు ఉంటుంది ఈ చిత్రం కథ. ఈ మూవీలో యంగ్ హీరో పాత్రగా సాయి తేజ్ ను ఎలా ఇరికిస్తారు అనేది ఆసక్తిని కలిగించే అంశం. ఇదిలా ఉంటే..
ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది అని సముద్రఖని కన్ఫర్మ్ చేసేసాడు. పవన్ కళ్యాణ్ & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. సముద్రఖనినే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ‘పవన్ కళ్యాణ్ కు నేను పెద్ద ఫ్యాన్ ని.. త్వరలోనే ‘వినోదయ సీతమ్’ రీమేక్ కు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అంటూ ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్లలో సముద్ర ఖని చెప్పుకొచ్చాడు.