ఈ మధ్య కాలంలో కమెడియన్లు హీరోలుగా మారుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న వెన్నెల కిషోర్ మరికొన్ని రోజుల్లో చారీ 111 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మార్చి నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సంయుక్త విశ్వనాథన్ ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు జోడీగా నటించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సంయుక్త విశ్వనాథన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బన్నీ, తారక్, నాగ్ అంటే ఎంతో ఇష్టమని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరోలను ఎంతగానో అభిమానిస్తానని వెల్లడించారు. ఈతరం యాక్టర్లకు నాగార్జున ఇన్స్పిరేషన్ అని మా అమ్మ కూడా నాగార్జునను ఎంతో అభిమానిస్తారని సంయుక్త విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.
వెన్నెల కిషోర్ తో కలిసి యాక్టింగ్ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వెన్నెల కిషోర్ టాలెంటెడ్ యాక్టర్ అని ఆమె అన్నారు. సమంత అంటే ఎంతో అభిమానమని సామ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని సంయుక్త విశ్వనాథన్ పేర్కొన్నారు. తమన్నా, అనుష్క అంటే కూడా అభిమానం అని ఆమె వెల్లడించారు. నటిగా నాకు అత్యంత ఇన్స్పిరేషన్ కలిగించిన వ్యక్తి మాత్రం రజనీకాంత్ అని ఆమె చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో సంయుక్త విశ్వనాథన్ భవిష్యత్తులో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్స్ కు జోడీగా నటిస్తే సంయుక్త విశ్వనాథన్ రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సంయుక్త విశ్వనాథన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. చారీ 111 సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం సంయుక్త మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చారీ 111 సక్సెస్ వెన్నెల కిషోర్ కెరీర్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.