థియేటర్లకు ఆడియన్స్ రావడం అనేది తగ్గిపోయింది. రిలీజ్ కి ముందు సినిమాకి స్ట్రాంగ్ బజ్ ఉంటేనే లేకపోతే.. రిలీజ్ తర్వాత సూపర్ హిట్ టాక్ వస్తేనో తప్ప ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు అనేది వాస్తవం. పెద్ద హీరోల సినిమాలైనా సరే వీకెండ్ కే పాత సినిమా అయిపోయినట్టు ఆడియన్స్ భావిస్తున్నారు. తర్వాత ఓటీటీలో చూసుకుందాంలే అని మెజారిటీ ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. దీంతో సింగిల్ స్క్రీన్స్ చాలా చోట్ల మూత పడ్డ పరిస్థితి కనిపిస్తుంది.
పెద్ద సినిమాలు ఉన్న టైంలో మాత్రమే వాటిని ఓపెన్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మూసేస్తున్నారు. సీనియర్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సినిమాలకైనా ఇదే సీన్. కానీ 2025 సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేస్తుంది. ఈ సినిమా రూ.55 కోట్ల బడ్జెట్లోనే నిర్మించారు దిల్ రాజు (Dil Raju) . థియేట్రికల్ రైట్స్ నుండి రూ.40 కోట్లు వచ్చాయి. డిజిటల్ అండ్ శాటిలైట్ రూ.30 కోట్లకు అమ్మారు.
ఈ మధ్య కాలంలో శాటిలైట్ బిజినెస్ జరగడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే టీవీల్లో టెలికాస్ట్ అయ్యే వరకు ఆడియన్స్ ఆగడం లేదు. ఓటీటీకి రాగానే 4,5 సార్లు చూసేస్తున్నారు. దీంతో టీవీల్లో యాడ్స్ తో చూసేంత టైం పెట్టుకోవడం లేదు ప్రేక్షకులు. పైగా గ్రామాల్లో తప్ప.. సిటీల్లో, టౌన్లలో కేబుల్ కనెక్షన్స్ ఎవ్వరూ వాడట్లేదు. సో టీఆర్పీ రేటింగ్స్ అనుకున్నట్టు రావడం లేదు. అందువల్ల ఒకప్పటిలా భారీ రేట్లకి శాటిలైట్ హక్కులు కొనుగోలు చేయడానికి ఎంటర్టైన్మెంట్ సంస్థలు ముందుకు రావడం లేదు.
ఇలాంటి టైంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఓ టర్నింగ్ పాయింట్ గా నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు జీ వారు. అదేంటంటే.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ వాళ్ళవే కాబట్టి.. ముందుగా ఈ సినిమాని టీవీల్లో టెలికాస్ట్ చేసేసి ఆ తర్వాత జీ5 ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇలా చేస్తే టీవీల్లో ఆడియన్స్ ఎక్కువగా చూసే అవకాశాలు ఉన్నాయి. టీఆర్పీ కూడా బాగా వస్తుంది. ఇది కనుక వర్కౌట్ అయితే అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది.
Get ready to relive the Sankranthi vibe again #SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025