టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే ఏ రేంజ్‌లో హడావుడి జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈసారి కూడా పెద్ద హీరోల సినిమాల పోటీ ఆడియెన్స్‌లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ సీజన్‌లో ఏ సినిమా ఫైనల్ విజేతగా నిలుస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హాలిడేస్ అయితే ముగిశాయి. ఇక శని ఆదివారం చాలా కీలకమైన సమయం. మళ్ళీ సోమవారం జనాలు ఎవరి పనుల్లో వారు బిజీ అవుతారు. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకోవడానికి చివరి ఛాన్స్ అని చెప్పవచ్చు.
Sankranthiki Vasthunam
రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) భారీ బడ్జెట్‌తో విడుదలైంది. అయితే మొదటిరోజు ఊహించని ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. సినిమా వసూళ్లు 200 కోట్ల మార్క్‌ను చేరుకోగలవా లేదా అనేది అనుమానంగా మారింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇక నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన డాకు మహారాజ్ (Daaku Maharaaj) మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఈ సినిమాను మద్దతుగా నిలిచారు. కానీ వసూళ్లు మొదటిరోజు తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రోజున కలెక్షన్లు నిరాశపరిచాయి. అయితే శని, ఆదివారం రోజులలో ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ లభిస్తే, బ్రేక్ ఈవెన్ సాధించడానికి అవకాశం ఉంటుందని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam మాత్రం ఈసారి విన్నర్‌గా కనిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సీజన్‌కు తగ్గ కథతో వెంకటేశ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ వీకెండ్ తరువాత ఈ సినిమా సత్తా ఏమేరకు కొనసాగుతుందనేది చూడాలి. ప్రస్తుతం 200 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతి హాలిడేస్ ఫినిష్ అయ్యాయి. ఇక సినిమాలకు శని, ఆదివారం కలెక్షన్లే కీలకమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రెండు రోజుల్లో సినిమా ప్రదర్శన బాగుంటే ఆ సినిమాల (Sankranthiki Vasthunam) ఫుల్ రన్ రిజల్ట్‌కు దోహదపడతాయి.