మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) 15 వ సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కంటే కూడా దీనికి ఎక్కువ టైం, ఫోకస్ పెట్టి చేశాడు చరణ్. 3 ఏళ్ళ పాటు ఈ సినిమాతోనే గడిపేశాడు. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనుకున్న స్థాయిలో మెప్పించలేదు అన్నది వాస్తవం. మరోపక్క యాంటీ ఫ్యాన్స్ దీన్ని దారుణంగా తొక్కేశారు. విడుదలైన రెండు, మూడు గంటల్లోనే దారుణమైన నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసి..
Buchi Babu
హెచ్.డి ప్రింట్ ను బయటకు వచ్చేలా చేసి.. బస్సుల్లో, కేబుల్ టీవీల్లో టెలికాస్ట్ అయ్యేలా చేశారు. దీంతో నిర్మాత దిల్ రాజు దారుణంగా నష్టపోయారు. ఆయన దాదాపు రూ.200 కోట్లు నష్టపోయారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అదృష్టం బాగుండి పక్కనే వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వల్ల.. ఆయన కొంత వరకు గట్టెక్కేశారు. సో దిల్ రాజు (Dil Raju) సంగతి ఓకే కానీ.. చరణ్ పరిస్థితేంటి? చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్.. ‘గేమ్ ఛేంజర్’ ని కాపాడలేదు అనే రిమార్క్ గట్టిగా పడింది.
కాబట్టి.. ఓ పెద్ద సక్సెస్ ఇచ్చి చరణ్ మళ్ళీ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలి. అందుకే బుచ్చిబాబుతో (Buchi Babu Sana) చేస్తున్న తన 16వ (RC16 Movie) సినిమాపై చరణ్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. బుచ్చిబాబుకి కూడా ఇది కత్తి మీద సాములాంటిదే. ‘గేమ్ ఛేంజర్’ కనుక హిట్ అయ్యి ఉంటే.. ఆ హైప్ బుచ్చిబాబు సినిమాకి పనికొచ్చేది. కానీ ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ లేదు.
మొదటి నుండి ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెట్టాలి. ప్రతి అకేషన్ కి ఏదో ఒక అప్డేట్ డిజైన్ చేసుకుని.. దాన్ని ఫ్యాన్స్ కి ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే తన చరణ్ తో చేస్తున్న సినిమాకి హైప్ బిల్డ్ అవుతుంది. సో బుచ్చిబాబుపై ఇప్పుడు పెద్ద బాధ్యతే పడింది.