సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం ‘సంత’. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది.
దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. సంత తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 14 నుంచి మిగిలిన టాకీ పార్ట్ మరియు పాటలను చిత్రీకరిస్తాము. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లొ పాటల చిత్రీకరణ చెస్తాము. ఈ షెడ్యూల్ లొనె సినిమా షూటింగ్ ను కూడా ఫినిష్ చెస్తామన్నారు.