Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. మరో న్యూ రికార్డ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత వెంటనే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే సర్కారు వారి పాటు సినిమా కూడా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మరో రికార్డును సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చినప్పటికీ కూడా వీకెండ్స్ అనంతరం కాస్త కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఇక రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్గా క్లారిటీ వచ్చింది. అందుకు సంబంధించిన ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. 2022 ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఇదే అంటూ కేవలం పన్నెండు రోజుల్లోనే ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం గ్రేట్ రికార్డు అని కూడా వివరణ ఇచ్చారు.

అయితే ఈ కలెక్షన్స్ ఫేక్ అంటూ కూడా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మహేష్ బాబు కేవలం తన స్టార్ ఇమేజ్ తోనే సినిమాకు కలెక్షన్స్ తీసుకురావడంలో మరొకసారి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఈసినిమాకు చేసిన ప్రమోషన్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి.. ఆదివారం రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ సోమవారం రోజు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి.

మరో రెండు రోజుల్లో కామెడీ ఎంటర్టైనర్ సినిమా F3 భారీ స్థాయిలో విడుదల కాబోతోంది కాబట్టి ఆ లోపు మహేష్ హవా కొనసాగుతుంది. ఇక రీసెంట్ గా అమెరికా వెళ్ళిన మహేష్ బాబు వీలైనంత త్వరగా తిరిగి వచ్చి త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటి వారంలో స్టార్ట్ కానుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus