Sarkaru Vaari Paata Collections: అబౌవ్ యావరేజ్ గా నిలిచిన ‘సర్కారు వారి పాట’ ..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఫుల్ రన్ ముగిసింది. మే 12న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే మహేష్ స్టార్ డం.. సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది.మరీ బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ అబౌవ్ యావరేజ్ రిజల్ట్ ను సాధించింది.టికెట్ రేట్లు కనుక అందుబాటులో ఉండి.. ఓటిటి రిలీజ్ కనుక ఇంకాస్త వెనుకకు జరిపి ఉంటే కచ్చితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించేది అనేది ట్రేడ్ పండితుల అభిప్రాయం.

ప్రస్తుతానికైతే ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మూవీగా నిలిచింది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఒకసారి ‘సర్కారు వారి పాట’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 35.02 cr
సీడెడ్ 12.13 cr
ఉత్తరాంధ్ర 12.54 cr
ఈస్ట్  8.96 cr
వెస్ట్  5.65 cr
గుంటూరు  8.60 cr
కృష్ణా  6.32 cr
నెల్లూరు  3.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 92.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   7.00 cr
ఓవర్సీస్  13.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 112.94 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.112.94 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ చిత్రం రూ.8.06 కోట్ల నష్టాలను మిగిల్చింది.

టికెట్ రేట్లు కనుక అందుబాటులో ఉండి ఉంటే ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేది. ఓవరాల్ గా ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus